Thu Dec 19 2024 16:48:57 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మంత్రులకు శాఖల కేటాయింపు తర్వాతే
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయింది. పదకొండు మంది మంత్రులకు ముఖ్యమంత్రి శాఖలను కేటయిస్తారు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయింది. పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి వారికి శాఖలను కేటాయించలేదు. ఏ శాఖకు ఎవరిని కేటాయించాలన్న దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ నేతలతో చర్చించిన తర్వాతనే కేటాయింపు జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే సోషల్ మీడియాలో మంత్రులకు శాఖలను కేటాయించినట్లు వచ్చిన వార్తలను వారు కొట్టిపారేశారు. శాఖల కేటాయింపు ఒకటి రెండో రోజుల్లో జరిగే అవకాశముందని తెలుస్తోంది.
Next Story