Mon Apr 07 2025 05:30:41 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : మహిళలకు రేవంత్ మరో గుడ్ న్యూస్
మేడారం జాతరకు వెళ్లే మహిళ భక్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

మేడారం జాతరకు వెళ్లే మహిళ భక్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మేడారానికి కూడా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగానే ప్రయాణించవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి పధకం కింద ఉచిత బస్పు ప్రయాణం దేశంలో అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారానికి కూడా కల్పిస్తున్నామని చెప్పారు.
వెయ్యి కొత్త బస్సులను...
ఇందుకోసం కొత్త బస్సులను కూడా కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీకి త్వరలో వెయ్యి కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను కోట్ల మందికిపైగా మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారన్న ఆయన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను కూడా పెంచుతామని చెప్పారు. కొత్తగా ప్రారంభించిన బస్సుల్లో కొన్నింటిని మేడారం జాతరకు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
Next Story