Fri Nov 22 2024 23:37:46 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఎంత కాలం నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారాన్ని అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. అయితే జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్య ఉండదని, కేవలం తేదీలు మాత్రమే ఉంటాయని, నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో ఖాళీలను అందులో పేర్కొంటామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
పరీక్షలు ఎప్పుడంటే?
జాబ్ క్యాలెండర్ లో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్షలు అక్టోబరులో నిర్వహిస్తామని పేర్కొన్నారు. గ్రూప్ 2 పరీక్షలను డిసెంబరులోనూ , గ్రూప్ 3 పరీక్షలు నవంబరులో నిరవహించనున్నట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, నియామకాల కోసం పెస్టెంబరులో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. నవంబరులో దీనికి సంబంధించిన పరీక్షలుంటాయని చెప్పారు. అలాగే ట్రాన్స్ కోలోని ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబరులో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. వచ్చే జనవరిలో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Next Story