Fri Nov 15 2024 22:36:42 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేటితో రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు నేటితో రుణమాఫీని పూర్తి చేయనుంది.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు నేటితో రుణమాఫీని పూర్తి చేయనుంది. రెండు లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. రెండు లక్షల రూపాయల రుణం తీసుకున్న రైతులకు నేటి నుంచి మాఫీ అయ్యే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. రెండు లక్షల రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు రెండు లక్షల రుణమాఫీ నేటితో పూర్తవుతుంది. తెలంగాణ రైతులలు ఆగస్టు 15వ తేదీతో రుణవిముక్తులవుతున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది.
ఏకకాలంలో...
పార్లమెంటు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి చెప్పింది చెప్పనిట్లుగానే మూడు విడతలుగా రైతు రుణమాఫీ చేసినట్లయింది. నేటితో అంటే ఆగస్టు 15వ తేదీ నాటికి రైతు రుణమాఫీ ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. రుణమాఫీ కారణంగా తెలంగాణలో లక్షలe మంది రైతులు లబ్దిపొందనున్నారు. ఇందుకోసం తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 31 వేల కోట్ల రూపాయలను కేటాయించింది.
మూడు విడతల్లో....
తొలి విడతగా లక్ష లోపు రుణాలను తీసుకున్న రైతుల రుణమాఫీ చేసింది. దీనివల్ల 11.14 లక్షల మంది లబ్డిపొందారు. రెండో విడత కింద లక్ష నుంచి లక్షన్నర వరకూ రైతు రుణమాఫీ చేశారు. దీని వల్ల 6.40 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. ఈరోజు నుంచి మూడో విడత రెండు లక్షల రైతు రుణమాఫీ చేయనున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో దీనిని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో అన్నదాతలు తమ రుణాలు మాఫీ కావడంతో తిరగి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే వీలుంది. పెట్టుబడి సాయం కోసం ప్రయివేటు వ్యక్తుల చేతిలో ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చెప్పింది చెప్పినట్లుగానే రుణమాఫీ చేస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల సాంకేతిక కారణాలతో రుణమాఫీ జరగని వారికి కూడా నేటి నుంచి ఆ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Next Story