Thu Jan 16 2025 19:09:13 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రైతులకు గుడ్ న్యూస్ నేడే రెండో విడత రుణమాఫీ
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతులకు రుణమాఫీ చేయనుంది.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతులకు రుణమాఫీ చేయనుంది. రెండో విడతగా రుణమాఫీ ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శాసనసభ ప్రాంగణంలో 1.50 లక్షల రూపాయల రుణాలను మాఫీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. 1.50 లక్షల రూపాయల వరకూ ఉన్న రుణమాఫీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. దీనివల్ల ఏడులక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు.
మొదటి విడతలో...
ఇందుకోసం ప్రభుత్వం ఏడువేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనుంది. ఇప్పటికే మొదట విడతలో 10.83 లక్షల మంది రైతులు రుణమాఫీ వల్ల ప్రయోనం పొందారు. ఇందుకోసం ప్రభుత్వం 6,035 కోట్ల రూపాయలను జమ చేసింది. మొత్తం 11.34 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొదటి విడత రుణమాఫీ నిధులు జమ మయ్యాయి. రెండో విడతలో ఏడు లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు. మొత్తం మూడు విడతలుగా రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆగస్టు 15వ తేదీ...
ఆగస్టు 15వ తేదీ లోపు రెండు లక్షల రైతు రుణమాఫీని చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేసే ప్రక్రియలో భాగంగా వరసగా విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. కొందరికి వివిధ కారణాల వల్ల రైతు రుణమాఫీ అందలేదన్న ఫిర్యాదులు అందడంతో వారి కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. వారి నుంచి వినతుల స్వీకరించి అర్హులైన వారికి రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story