Fri Dec 20 2024 22:46:12 GMT+0000 (Coordinated Universal Time)
Congress : ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది. తీన్మార్ మల్లనను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.
కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది. తీన్మార్ మల్లనను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్థానంలో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమయింది.
ఎమ్మెల్సీ స్థానానికి...
ఈ స్థానానికకి తీన్మార్ మల్లన్నను తమ పార్టీ అభ్యర్థిగా పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు రావడంతో ఆయననే తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ స్థానంలో మొత్తం 4.61 లక్షల మంది ఓటర్లున్నారు.
Next Story