Mon Dec 23 2024 07:25:09 GMT+0000 (Coordinated Universal Time)
ఫస్ట్ లిస్ట్ ప్రకటించగానే .. కాంగ్రెస్లో రగడ.. ఫ్లెక్సీలు చించి
కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించింది.55 మందితో తొలి జాబితా ప్రకటించింది. కొన్ని చోట్ల అసంతృప్తులు భగ్గుమంటున్నాయి
కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించింది. యాభై ఐదు మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. అయితే కొన్ని చోట్ల అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ కు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయంలో ఉన్న ఫొటోలను కార్యకర్తలు చించి వేశారు. తమ నిరసనను తెలియజేశారు. గత ఐదేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రకటించిన అభ్యర్థికి మద్దతు తెలపబోమంటూ వారు నిరసన తెలియజేశారు.
కటౌట్లు దహనం...
కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి బయట పడింది. నిన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన జూపల్లి కృష్ణారావు పేరు తొలి జాబితాలో ఖరారు కావడంతో తొలి నుంచి పనిచేసిన చింతలపల్లి జగదీశ్వరరావు అనుచరులు పార్టీ కార్యాలయంలో హల్ చల్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలను చించి వేశారు. కటౌట్లను తొలగించి దహనం చేశారు. కొందరు కాంగ్రెస్ టిక్కెట్లను అమ్ముకుంటూ పార్టీకి ద్రోహం చేస్తున్నారని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి బయటకు పంపారు.
Next Story