Thu Dec 19 2024 06:53:41 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. బీఆర్ఎస్ ముప్ఫయి సీట్లకు 30 నుంచి నలభై సీట్లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశముంది.
కొడంగల్ లో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 32,800 ఓట్ల ఆధిక్యతతో రేవంత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డిపై గెలుపొందారు. భారీ మెజారిటీని కొడంగల్ విజయాన్ని సాధించడంతో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి గాంధీ భవన్ కు బయలుదేరి వెళ్లారు.
మెదక్ కాంగ్రెస్ దే...
మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవందర్ రెడ్డి పై ఆయన గెలుపు సాధించారు. నారాయణఖేడ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి సంజీవ్ రెడ్డి గెలుపొందారు. ఇప్పటికే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. బీఆర్ఎస్ ముప్ఫయి సీట్లకు 30 నుంచి నలభై సీట్లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశముంది.
Next Story