Sun Dec 22 2024 21:40:28 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కాంగ్రెస్ కు దాసోజు శ్రావణ్ గుడ్ బై
రేవంత్ రెడ్డి వల్ల పార్టీ పూర్తిగా నాశనం అవుతుందని కాంగ్రెస్ నేత దాసోజ్ శ్రావణ్ ఆరోపించారు
రేవంత్ రెడ్డి వల్ల పార్టీ పూర్తిగా నాశనం అవుతుందని కాంగ్రెస్ నేత దాసోజ్ శ్రావణ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ పూర్తిగా నామరూపాల్లేకుండా పోతుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో అగ్రకుల అహంకారం పెరిగిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి, ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్, వ్యూహకర్త సునీల్ కలసి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. తప్పుడు సర్వేలతో తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్నారని విమర్శించారు. తన వర్గాన్ని బలమైన నేతలుగా, ఇతర వర్గాల నేతలను బలహీనంగా చూపిస్తున్నారన్నారు. రేవంత్ మాఫియాను నడిపినట్లు పార్టీని నడుపుతున్నారని దాసోజు శ్రావణ్ ఆరోపించారు.
తప్పుడు నివేదికలిస్తూ...
ప్రశ్నించే వాళ్లపై తప్పుడు నివేదికలను పంపిస్తూ అధిష్టానాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారని దాసోజు శ్రావణ్ అన్నారు. సొంత ముఠాతో కాంగ్రెస్ ను భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కార్యక్రమాలు తూ తూ మంత్రంగా నిర్వహిస్తున్నారన్నారు. దళిత దండోర, నిరుద్యోగ గర్జన ఏమైందని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అపరిపక్వత, అనాలోచిత, అనారిగక చర్యల కారణంగా కాంగ్రెస్ నానాటికీ బలహీనమవుతుందని దాసోజు శ్రావణ్ అన్నారు. వసూళ్ల కోసం రాజకీయ పార్టీని రేవంత్ రెడ్డి హస్తగతం చేసుకున్నట్లు కన్పిస్తుందన్నారు. ఇన్నాళ్లూ ఆదరించిన పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Next Story