Tue Apr 01 2025 01:18:49 GMT+0000 (Coordinated Universal Time)
ఇక సిల్వర్ స్క్రీన్ పై జగ్గారెడ్డి
త్వరలో తాను సినిమాల్లో నటించబోతున్నట్లు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు

త్వరలో తాను సినిమాల్లో నటించబోతున్నట్లు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఈ కామెంట్స్ చేశారు. తాను లవ్ స్టోరీలో స్పెషల్ రోల్ లో నటించనున్నానని జగ్గారెడ్డి తెలిపారు. తన ఒరిజనల్ క్యారెక్టర్ కు సినిమాలోని రోల్ అద్దం పట్టనుందన్న ఆయన అందుకే సినిమాలో నటిస్తానని చెప్పారు.
వచ్చే ఉగాదికి సినిమా...
పీసీసీ, ముఖ్యమంత్రి అనుమతి తోనే సినిమాలో నటిస్తానని, ఈ ఉగాదికి సినిమా స్టోరీ వింటానని, వచ్చే ఉగాదికి సినిమా విడుదల కానుందని జగ్గారెడ్డి తెలిపారు. ఒక వ్యక్తి కలిసి తన క్యారెక్టర్ కు తగ్గట్టుగా క్యారెక్టర్ ఉన్న సినిమా ఉందని చెప్పారని, సినిమాలో నటించమని అడిగారని, ఇంటర్వల్ ముందు మొదలయ్యే పాత్ర, సినిమా చివరి వరకు ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు.
Next Story