Sun Dec 22 2024 06:07:25 GMT+0000 (Coordinated Universal Time)
Jaggareddy : కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ ధర్నా
మాజీ మంత్రి హరీశ్ రావుకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ మోసగాళ్లేనని ఆయన అన్నారు
మాజీ మంత్రి హరీశ్ రావుకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ మోసగాళ్లేనని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హరీశ్ రావు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. పార్టీపై గ్రిప్ సంపాదించుకునేందుకే హరీశ్ రావు తాపత్రయపడుతున్నట్లు అర్థమవుతుందని అందుకే హరీశ్ రావు ఇలా అన్ని విషయాల్లో అడ్డదిడ్డంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు.
మోసగాళ్లు ఇద్దరూ...
హరీష్ రావు రాహుల్‌గాంధీ ఇంటిముందు ధర్నా చేస్తా అంటున్నారని, నాడు దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కేసీఆర్ కుటుంబం కాదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఒక్క హామీ కూడా అమలు చేయని మీరు రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే ఊరుకుంటామా? అని వార్నింగ్ ఇచ్చారు. నువ్వు నీ మామ మోసాల కుటుంబం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసినందుకు కేసీఆర్ ఫాం హౌస్ దగ్గర దీక్ష చేస్తానని తెలిపారు. హరీశ్ రావు ఢిల్లీ పోయిన రోజే నేను తాను మీ మామ కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ దీక్ష చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు.
Next Story