Sun Dec 22 2024 23:53:44 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా
ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రకటించారు
ఎమ్మెల్సీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రకటించారు. పదవికి రాజీనామా చేయాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. తన ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగిందని ఆయన తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ను తనకు తెలియకుండా పార్టీలోకి తీసుకోవడంపై జీవన్ రెడ్డి కినుక వహించారు. నిన్నటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు. అనేక మంది కాంగ్రెస్ నేతలు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు.
బుజ్జగించినా...
నిన్న రాత్రి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అయితే తనను సంప్రదించకుండా తన జిల్లాలో, తన నియోజకవర్గంలో నేతలను పార్టీలోకి తీసుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే పార్టీ మారే ఆలోచన లేదని మాత్రం జీవన్ రెడ్డి తెలిపారు. తనను ఎవరూ సంప్రదించలేదని కూడా ఆయన తెలిపారు. బీజేపీ నుంచి కూడా తనను సంప్రదిస్తున్నారన్న దానిలో వాస్తవం లేదని జీవన్ రెడ్డి తెలిపారు.
Next Story