Thu Nov 28 2024 22:40:37 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ పాదయాత్రకు అనుమతి లేదు
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఏఐసీసీ అనుమతి లేదని కాంగ్రెస్ నేత మహేశ్వరర్ రెడ్డి తెలిపారు
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఏఐసీసీ అనుమతి లేదని కాంగ్రెస్ నేత మహేశ్వరర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఏఐసీసీ నేతలు తమకు తెలిపారని ఆయన అన్నారు. ఏఐసీసీ సర్క్యులర్ ను రేవంత్ తప్పుదోవ పట్టించే విధంగా పాదయాత్ర ను డిజైన్ చేసుకున్నారని అన్నారని అన్నారు. మీడియాతో చిట్ చాట్ చేస్తూ మహేశ్వర్ రెడ్డి ఏఐసీసీ సర్క్యులర్ లో కేవలం బ్లాక్ ల వారీగా పాదయాత్రలు చేసుకోవాలని, రాష్ట్ర నేతలు వెళ్లి పాదయాత్రలో పాల్గొనాలని చెప్పారన్నారు. రెండు నెలల పాటు మాత్రమే పాదయాత్రలు ప్లాన్ చేసుకోవాలని ఏఐసీసీ సర్క్యులర్ లో ఉందని తెలిపారు.
సీనియర్లకు ఖర్గే ఫోన్...
కానీ రేవంత్ రెడ్డి ఐదు నెలల పాటు తన పాదయాత్ర ప్లాన్ చేసుకున్నారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. దీనికి తోడు సీనియర్ కాంగ్రెస్ నేతలకు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. వారం రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రేపు బోయినపల్లిలో జరిగే కాంగ్రెస్ శిక్షణ సభలకు హాజరు కావాలా? వద్దా? అని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆలోచనలో ఉన్నారు. అయితే ఖర్గే మాత్రం రేపటి సమావేశాలకు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. మొత్తం మీద మళ్ల ీరేవంత్ రెడ్డి పాదయాత్రపై కాంగ్రెస్ లో మరోసారి దుమారం చెలరేగింది.
Next Story