Fri Dec 20 2024 13:59:57 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Congress : ఈరోజే సెకండ్ లిస్ట్
కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల జాబితా ఖరారయిందని ఆ పార్టీ నేత మురళీధరన్ తెలిపారు
కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల జాబితా ఖరారయిందని ఆ పార్టీ నేత మురళీధరన్ తెలిపారు. ఈరోజు తెలంగాణ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. 45 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసినట్లు ఆయన చెప్పారు. సీపీఎం, సీపీఐకి చెరో రెండు స్థానాలను ఇచ్చామని ఆయన తెలిపారు. గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలన్న ఉద్దేశ్యంతో వడపోత చేపట్టినట్లు తెలిపారు.
అన్ని వర్గాలకు...
కాంగ్రెస్ తొలి జాబితా తరహాలోనే రెండో జాబితా కూడా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని ఆయన తెలిపారు. సామాజికవర్గాలకు న్యాయం జరుగుుతందని చెప్పారు. కొత్తగా చేరిన వారికి టిక్కెట్లు ఇస్తున్నామన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈసారి అధికారంలోకి రావాలనుకుంటే కొన్ని త్యాగాలు చేయడం అవసరమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story