Sun Dec 22 2024 21:19:30 GMT+0000 (Coordinated Universal Time)
Congress : ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర... డీజీపీకి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
డీజీపీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ,బీజేపీ ఎమ్మెల్యేల పై డీజీపీ కి ఫిర్యాదు చేశారు
డీజీపీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ,బీజేపీ ఎమ్మెల్యేల పై డీజీపీ కి ఫిర్యాదు చేశారు. బీజేపీ ,బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నాయని పిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పీసీసీ జనరల్ సెక్రెటరీలు కైలాష్ నేత , చారుకొండ వెంకటేష్ , మధుసూదన్ రెడ్డిలు డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు.
ఆరు నెలల్లో...
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి బీజేపీ ,బీఆర్ఎస్, ఎంఐఎంలు కలసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించుతామని, మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని వ్యాఖ్యానించారని డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ప్లాన్ చేస్తున్న వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story