Sun Dec 22 2024 13:48:03 GMT+0000 (Coordinated Universal Time)
ఎల్లుండి తెలంగాణకు రాహుల్, ప్రియాంక
ఈ నెల 20న తెలంగాణాకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రానున్నారు.
ఈ నెల 20న తెలంగాణాకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రానున్నారు. ఆగస్టు 20న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా...
ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు రావాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను కోరారు. ఇందుకు సానుకూలంగా వారు స్పందించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలపై కూడా ఈ సందర్భంగా వివరించనున్నారు.
Next Story