Fri Dec 20 2024 18:39:24 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వరంగల్‌కు రాహుల్, ప్రియాంక
నేడు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రానున్నారు. కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు
నేడు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రానున్నారు. సాయంత్రం కాంగ్రెస్ బస్సు యాత్రను వారు ప్రారంభించనున్నారు. ఈరోజు సాయంత్రం 3.30 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు రాహుల్, ప్రియాంక చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో వరంగల్ జిల్లాకు బయలుదేరి వెళతారు. అక్కడ రామప్ప టెంపుల్ ను దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
బస్సు యాత్రతో...
పూజల అనంతరం సాయంత్రం ఐదు గంటలకు రాహుల్, ప్రియాంక గాంధీలు బస్సు యాత్రను ప్రారంభిస్తారు. రామప్ప గుడి నుంచి బస్సు యాత్ర నేరుగా ములుగు చేరుకుంటుంది. ములుగు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో వారు ప్రసంగించనున్నారు. రాహుల్, ప్రియాంక పర్యటన సందర్భంగా పార్టీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర ప్లాన్ చేసింది.
Next Story