Sun Dec 22 2024 15:56:36 GMT+0000 (Coordinated Universal Time)
Congress : అద్దంకి పేరు లేదు.. చివరి నిమిషంలో పేర్ల మార్పు
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అధినాయకత్వం ఇద్దరి పేర్లను ఖరారు చేసింది
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అధినాయకత్వం ఇద్దరి పేర్లను ఖరారు చేసింది. మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్లను పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. రేపటితో నామినేషన్ల గడువు ముగియడంతో కొద్దిసేపటి క్రితం ఈ రెండు పేర్లను ప్రకటించింది.
ఈ రెండు పేర్లు...
ఈరోజు వరకూ అద్దంకి దయాక్ పేరు ప్రచారంలో వినిపించింది. కానీ బీసీ కోటా కింద మహేశ్ కుమార్ గౌడ్ కు అవకాశం ఇవ్వాలని పార్టీ తీసుకున్న నిర్ణయంతో అద్దంకి దయాకర్ ను పక్కన పెట్టినట్లయింది. మరి అద్దంకి దయాకర్ పేరును తర్వాత వచ్చే ఎమ్మెల్సీ పదవులకు ఎంపిక చేస్తారని చెబుతున్నారు. రెండు పేర్లు అధికారికంగా ప్రకటించడంతో రేపు వీరిద్దరూ నామినేషన్లు వేయనున్నారు.
Next Story