Mon Dec 23 2024 06:42:16 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో తక్కువ స్థానాలు రావడంపై హైకమాండ్ త్రీమెన్ కమిటీ
పార్లమెంటు ఎన్నికల్లో తక్కువ స్థానాలను సాధించడంపై కాంగ్రెస్ అధినాయకత్వం లోతైన విశ్లేషణకు దిగనుంది.
పార్లమెంటు ఎన్నికల్లో తక్కువ స్థానాలను సాధించడంపై కాంగ్రెస్ అధినాయకత్వం లోతైన విశ్లేషణకు దిగనుంది. ఈ మేరకు తాము ఆశించిన రాష్ట్రాల్లో తక్కువ స్థానాలను దక్కించుకోవడంపై ఒకింత అసహనంగా ఉన్న పార్టీ అధినాయకత్వం సీట్లు తగ్గడానికి గల కారణాలను విశ్లేషించడానికి కమిటీలను నియమించింది. ఇందులో భాగంగా తెలంగాణకు కూడా ఒక కమిటీని కాంగ్రెస్ అధినాయకత్వం నియమించింది. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా కమిటీలను ముగ్గురు సభ్యులతో నియమించింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గడ్, ఒడిశా, కర్ణాటకల్లో కూడా కమిటీని నియమించింది.
నివేదిక అందిన తర్వాత...
తెలంగాణలో కాంగ్రెస్ కు డబుల్ డిజిట్ స్థానాలు వస్తాయని హైకమాండ్ ఆశించింది. అయితే ఎనిమిది స్థానాలకే పరిమితం కావడంతో దీనిపై విశ్లేషణ చేయడానికి ముగ్గురితో కమిటీని నియమించింది. ఈ కమిటీలో కేరళకు చెందిన కురియన్, అస్సాంకు చెందిన రకీబుల్ హసన్, పంజాబ్ కు చెందిన పర్గత్ సింగ్ ను నియమించింది. పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ సీట్లు రావడానికి గల కారణాలను గుర్తించి ఈ కమిటీ హైకమాండ్ కు నివేదిక ఇవ్వనుంది.
Next Story