Wed Apr 16 2025 08:43:44 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు కాంగ్రెస్ ఎల్పీ సమావేశం
నేడు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది

నేడు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఉదయం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఇటీవల ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడంతో కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. ఒక మంత్రికి వ్యతిరేకంగా ఈ సమావేశం జరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయి వారి సమస్యలపై చర్చించనున్నారు.
సాయంత్రం ఢిల్లీకి...
ఈ సమావేశానికి పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ కూడా పాల్గొంటారు. ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడాన్ని సీరియస్ గా తీసుకున్న హైకమాండ్ వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఈ సీఎల్పీ భేటీ జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ విషయాలతో పాటు, మంత్రివర్గ విస్తరణపై మల్లికార్జున ఖర్గే తో చర్చించే అవకాశముంది.
Next Story