Sun Dec 22 2024 21:16:24 GMT+0000 (Coordinated Universal Time)
Congress : నేడు సీఎల్పీ సమావేశం
నేడు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. రాత్రి ఏడు గంటలకు నానక్రామ్ గూడలో ఈ సమావేశం జరుగుతుంది.
నేడు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. రాత్రి ఏడు గంటలకు నానక్రామ్ గూడలో ఈ సమావేశం జరుగుతుంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాజ్యసభ పదవికి పోటీ చేస్తునన అభిషేక్ సింఘ్వీ హాజరవుతున్నారు. ఆయన రాత్రి ఏడు గంటలు హైదరాబాద్ కు చేరుకుని నేరుగా సీఎల్పీ సమావేశానికి చేరుకుని తనకు ఓటు వేయాలని అభ్యర్థించనున్నారు.
రేపు నామినేషన్...
రేపు ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీలో అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. కె.కేశవరావు రాజీనామాతో ఏర్పడిన ఖాళీ జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ అధినాయకత్వం అభిషేక్ సింఘ్విని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సీఎల్పీ సమావేశం జరుగుతుంది. బీఆర్ఎస్ ఈఎన్నికల్లో పోటీ చేేసే అవకాశం లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి.
Next Story