Mon Dec 23 2024 06:09:52 GMT+0000 (Coordinated Universal Time)
Congress : ఈరోజు సీఎల్పీ మీటింగ్.. రేపు సీఎం ప్రమాణ స్వీకారం
కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఈరోజు రాత్రికి జరగనుంది. రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు
కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఈరోజు రాత్రికి జరగనుంది. రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ కు ఇప్పటికే మెజారిటీ స్థానాలు రావడంతో ఎన్నికయిన ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్ లోని హోటల్ కు చేరుకోవాలని ఆదేశాలు వెళ్లాయి.
అక్కడే ఎన్నుకుని...
అక్కడ సీఎల్పీ నేతను ఎన్నుకుంటారు. నిజానికి డిసెంబరు 9వ తేదీన ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయలనుకున్నప్పటికీ రేపు మంచి రోజు కావడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ముందు ప్రమాణ స్వీకారం చేయాలని హైకమాండ్ నిర్ణయించడంతో రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Next Story