Thu Dec 19 2024 23:14:00 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీకి కోమటిరెడ్డి... ప్రియాంకతో భేటీ
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన నేడు ప్రియాంక గాంధీని కలవనున్నారు.
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన నేడు ప్రియాంక గాంధీని కలవనున్నారు. ప్రియాంక గాంధీ మధ్యాహ్నం రెండు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. కోమటిరెడ్డి కోరిక మేరకే అపాయింట్మెంట్ దొరికింది. దీంతో ఆయన కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రియాంక గాంధీతో పాటు మరికొందరు ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యే అవకాశముందని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక గాంధీ చర్చించే అవకాశాలున్నాయి.
డిమాండ్లను....
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొంత కాలంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. వారిద్దరినీ పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా అసహనం వీరిద్దరి పై అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరోవైపు తనను దూషించిన అద్దంకి దయాకర్, చెరుకు సుధాకర్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story