Mon Dec 23 2024 14:30:27 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ బ్యాచ్ కు జగ్గారెడ్డి వార్నింగ్
తనను టీఆర్ఎస్ ఏజెంటుగా కొందరు ప్రచారం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
తనను టీఆర్ఎస్ ఏజెంటుగా కొందరు ప్రచారం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో వ్యక్తిగత పంచాయతీలు లేవని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఎందరో కేటీఆర్ ను రహస్యంగా కలిశారని జగ్గారెడ్డి ఆరోపించారు. నియోజకవర్గాల్లో పనుల కోసం కలవడంలో తప్పులేదని ఆయన అన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రయాణికులతో సహా అందరూ మృతి చెందుతారన్నారు. పీసీసీ చీఫ్ కూడా కాంగ్రెస్ కు డ్రైవర్ లాంటి వారని, తాము ప్రయాణికులవంటి వారమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
ఆయన అభిమాన సంఘాలు...
పార్టీలు వేరైనా ఎదురుపడినప్పుడు పలకరించుకోవడం మామూలేనని జగ్గారెడ్డి చెప్పారు. తనను కేటీఆర్ కోవర్టుగా తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ లో చిల్లర బ్యాచ్ తయారైందని ఆరోపించారు. పార్టీని నాశనం చేస్తున్నది నేనా? ఒక వ్యక్తి అభిమాన సంఘాలా? అని జగ్గారెడ్డి అన్నారు. డ్రైవర్ సరిగా లేడనే తాను పార్టీ హైకమాండ్ కు లేఖ రాశానని చెప్పారు. లీకులపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మద్దతుదారులకు జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ కలసిన ఫొటోలను ఆయన మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
Next Story