Thu Dec 19 2024 18:05:30 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డి ఇష్యూ..రంగంలోకి దిగిన దిగ్విజయ్
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని హైకమాండ్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు అప్పగించింది.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు అప్పగించింది. దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి కోమటిరెడ్డిని రెండు మూడు రోజుల్లోగా ఢిల్లీకి రావాలని కోరారు. తొందరపడకుండా, సమస్యలేమిటో చెప్పాలని, అందుకు పరిష్కారం హైకమాండ్ చూపిస్తుందని దిగ్విజయ్ సింగ్ వివరించినట్లు తెలిసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ అలెర్ట్ అయింది.
బుజ్జగించేందుకు....
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ వ్యూహకర్త సునీల్ తో పాటు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్ దించింది. పార్టీలో కొనసాగేందుకు ఆయన ఏం కోరుకుంటున్నారో చెప్పాలని కూడా వీరు కోరనున్నారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుంటే కాంగ్రెస్ లో భవిష్యత్ ఉంటుందన్న భరోసాను హైకమాండ్ నేరుగా కల్పిస్తుందన్న హామీని వీరు ఇవ్వనున్నారని తెలిసింది. గతంలో పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జిగా ఉన్న దిగ్విజయ్ కు ఈ బాధ్యతలను అప్పగించడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెత్తబడతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story