Mon Dec 23 2024 08:28:24 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం కేసీఆర్ కు షాక్.. కేసుపెట్టిన ఎమ్మెల్యే
అలాగే వరద బాధితులకు మరో ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తామని కూడా చెప్పారని, కేసీఆర్ హామీ ఇచ్చి ఏడాది పూర్తయినా
సీఎం కేసీఆర్ కు ఓ ఎమ్మెల్యే ఊహించని షాకిచ్చారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదావరి వరద బాధితులకు కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మాట తప్పారని వీరయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతేడాది జులై17న సీఎం కేసీఆర్ భద్రాచలంలో పర్యటించారని, గోదావరి వరద నేపథ్యంలో కరకట్ట నిర్మాణం కోసం ఏకం రూ.1000 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
అలాగే వరద బాధితులకు మరో ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తామని కూడా చెప్పారని, కేసీఆర్ హామీ ఇచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకూ వాటి అమలు జరగలేదని పొదెం వీరయ్య వాపోయారు. ప్రజలకు హామీలిచ్చి.. వాటిని అమలు చేయకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారంటూ పొదెం వీరయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం పై ఎమ్మెల్యే కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఈ కేసుపై బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Next Story