Mon Dec 15 2025 03:55:13 GMT+0000 (Coordinated Universal Time)
Priyanka Gandhi : నేడు ప్రియాంక షెడ్యూల్ ఇదే
నేడు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు

నేడు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా ఒకరోజు మాత్రమే గడువు ఉండటంతో ప్రియాంక గాంధీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు మూడు నియోజకవర్గాలలో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
మూడు సభల్లో...
ఉదయం పదకొండు గంటలకు భువనగిరిలో జరిగే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. అనంతరం ఒంటిగంటకు గద్వాల్ లో జరిగే బహిరంగ సభలో ఆమె పాల్గొననున్నారు. ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఆమె పర్యటించనున్నారు. ప్రియాంక గాంధీ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు నేతలు పూర్తి చేస్తున్నారు. భారీగా జనసమీకరణ చేస్తున్నారు.
Next Story

