Mon Dec 23 2024 06:09:53 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో రాహుల్.. వాట్ నెక్స్ట్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 2023, సెప్టెంబర్ 17వ తేదీ ఆదివారం హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ రానున్నారు. 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్ పోర్టు నుంచి తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకుంటారు. అక్కడ సీడబ్ల్యూసీ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం అక్కడే రాత్రికి బస చేస్తారు. 17వ తేదీ మధ్యాహ్నం తుక్కుగూడలోని కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొంటారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. తుక్కుగూడ సభ అనంతరం 17వ తేదీ రాత్రి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా పాల్గొంటున్నారు. ఈ సభలోనే ఐదు గ్యారెంటీలను ప్రకటించనున్నారు.
హైదరాబాద్ లో నేటి నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. తాజ్ కృష్ణ హోటల్ లో శని, ఆదివారం ఈ భేటీలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొననున్నారు. మధ్యాహ్నం సీడబ్ల్యూసీ సభ్యులకు టీపీసీసీ విందు ఇస్తుంది. విందు అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం సమావేశం అనంతరం బహిరంగ సభ నిర్వహించున్నారు.తెలంగాణ ఎన్నికలే టార్గెట్ గా సీడబ్యూసీ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించడం వల్ల పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండనుంది.
Next Story