Mon Nov 18 2024 04:37:37 GMT+0000 (Coordinated Universal Time)
హైకమాండ్ సీరియస్.. కోమటిరెడ్డి ఆడియో వ్యవహారం
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలిసింది.
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలిసింది. ముఖ్యనేతలు గాంధీ భవన్ లో సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ కోమటిరెడ్డి ఆడియో వ్యవహారాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ వివరణ కోరే అవకాశముంది. కోమటిరెడ్డి మాత్రం కుటుంబసభ్యులతో కలసి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లారు.
సోదరుడికి మద్దతివ్వాలని...
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడులోని ఒక కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతివ్వాలని కోరారు. తాను త్వరలో పీసీసీ చీఫ్ ను అవుతానని, రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెస్తానని చెప్పారు. పార్టీలను చూడొద్దని, రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలని ఆయన కోరినట్లు విడుదలయిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలిసింది.
Next Story