Mon Dec 15 2025 04:09:37 GMT+0000 (Coordinated Universal Time)
మే 6న తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ
వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకూ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో..

వరంగల్ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మే 6వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా వరంగల్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బహిరంగ సభకు జనసమీకరణ చేసే పనిలో పడ్డారు. బహిరంగ సభకు ముందు భారీ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకూ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రాహుల్ గాంధీ బహిరంగ సభ జరగనుంది. కాగా.. వరంగల్ లో రాహుల్ గాంధీ పర్యటన, బహిరంగ సభ నేపథ్యంలో రేవంత్ రెడ్డి బృందం ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని పరిశీలించేందుకు వచ్చింది. రేవంత్ రెడ్డి మైదానాన్ని పరిశీలిస్తుండగానే.. జంగా వర్గీయులు నాయిని వర్గీయులపై దురుసుగా ప్రవర్తించారు. దాంతో నాయిని వర్గీయులు తిరిగి దాడి చేశారు. ఇదంతా జంగా కళ్లముందే జరగడం గమనార్హం.
Next Story

