Sun Dec 22 2024 16:29:54 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థుల ఖరారు
ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది
ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. ఈ నెల 18వ తేదీన నామినేషన్లకు ఆఖరి గడువు కావడంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను అధినాయకత్వం ఖరారు చేసింది. నామినేషన్లకు సంబంధించి అన్ని సిద్ధం చేసుకోవాలని వారికి సమాచారం ఇచ్చింది.
ఇద్దరూ గత ఎన్నికల్లో...
తుంగతుర్తి నుంచి గత ఎన్నికల్లో టిక్కెట్ రాకపోయినా పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసిన అద్దంకి దయాకర్ తో పాటు ఎన్ఎస్క్ష్క్ష్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ లకు కూడా ఎమ్మెల్సీ అవకాశం కల్పించింది. బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఎమ్మెల్యే కోటా కింద ఇద్దరి పేర్లు ఖరారయినట్లు తెలిసింది.
Next Story