Mon Dec 15 2025 06:20:21 GMT+0000 (Coordinated Universal Time)
సంచలన కామెంట్స్ చేసిన కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు తాను పార్టీలో కొనసాగేది, లేనిది చెబుతానని ఆయన అన్నారు. ప్రస్తుతం అయితే తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. అయితే రాజకీయాలకు తాను కొంత దూరంగా ఉన్నానని ఆయన తెలిపారు.
షర్మిల విషయంలో...
నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి కంటే మరే నియోజకవర్గంలో జరగలేదని ఆయన తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను పనిచేశానని తెలిపారు. ఎక్కవ నిధులను నియోజకవర్గానికి తెచ్చింది తానే అని ఆయన తెలిపారు. వైఎస్ షర్మిల విషయంలో జరిగిన ఘటన దురదృష్టకరమని, ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story

