Fri Dec 20 2024 17:57:41 GMT+0000 (Coordinated Universal Time)
Congress : నాలుగు స్థానాలు పెండింగ్ లోనే.. కారణమిదే?
తెలంగాణ ఎన్నికల సందర్భంగాం కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 16 మందికి సీట్లను కేటాయించింది.
తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 16 మందికి సీట్లను కేటాయించింది. ఎన్నికల నామినేషన్ల గడువు ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. ఇక మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి కామారెడ్డి స్థానంలోనూ, నిజామాబాద్ అర్బన్ లో ఏనుగు రవీందర్ రెడ్డి ల పేర్లను ప్రకటించింది.
ఖరారు చేయని...
అయితే ఇంకా నాలుగు సీట్లను మాత్రం కాంగ్రెస్ పెండింగ్ లో ఉంచింది. సూర్యాపేట్, తుంగతుర్తి, చార్మినార్, మిర్యాలగూడ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. వీటిలో అభ్యర్థులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. వివిధ సమీకరణాలు ఇంకా అభ్యర్థులను నిర్ణయించలేకపోతున్నారు. ఇంకా కొన్ని పేర్లు పరిశీలనలో ఉండటంతో వాటిని పెండింగ్ లో ఉంచారు. ఈరోజు, రేపు ఫైనల్ జాబితా ప్రకటించే అవకాశముంది.
01. చెన్నూరు-జి.వివేక్
02. బోథ్ – గజేందర్
03. కామారెడ్డి – రేవంత్ రెడ్డి
04. జుక్కల్-తోట లక్ష్మీకాంతరావు
05. బాన్సువాడ- ఏనుగు రవీందర్‌రెడ్డి
06.నిజామాబాద్-షబ్బీర్‌అలీ
07. కరీంనగర్-పురుమళ్ల శ్రీనివాస్
08. సిరిసిల్ల- మహేందర్‌రెడ్డి
09. నారాయణఖేడ్-సురేష్ షెట్కార్
10. పటాన్చెరు-నీలం మధు
11. వనపర్తి-మేఘారెడ్డి
12 డోర్నకల్-రామచంద్రునాయక్
13. ఇల్లందు-కోరం కనకయ్య
14. వైరా-రామ్‌దాస్
15. సత్తుపల్లి-మట్టా రాగమయి
16. అశ్వరావుపేట-ఆదినారాయణ
Next Story