Mon Dec 23 2024 07:33:56 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు
కాంగ్రెస్ వర్కింగ్ సమావేశాల కోసం ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ వర్కింగ్ సమావేశాల కోసం ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో సాదర స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్నారు సోనియా,రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే. సీడబ్ల్యూసీ సభ్యులు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు నేతలు.
సెప్టెంబర్ 16,17న తాజ్ కృష్ణ హోటల్ లో రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీడబ్ల్యూసీలోని 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులు తొలి రోజు సమావేశాలకు హాజరుకానున్నారు. తొలి రోజు కేవలం సీడబ్ల్యూసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌ను నిర్వహించనున్నారు. అధికారంలో లేని 29 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, పార్లమెంట్ అబ్జర్వర్లు, ఆఫీస్ బేరర్లతో రెండో రోజు సమావేశం నిర్వహించనున్నారు.
Next Story