Fri Dec 20 2024 06:15:58 GMT+0000 (Coordinated Universal Time)
Congress : నేడు సీఎల్పీ సమావేశం...లీడర్ ఎన్నిక
తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నేడు సీఎల్పీ సమావేశం నిర్వహించబోతుంది
తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నేడు సీఎల్పీ సమావేశం నిర్వహించబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 64 స్థానాలు సాధించి అత్యధిక మెజారిటీ తెచ్చుకున్న నేపథ్యంలో నేడు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. దాదాపుగా రేవంత్ రెడ్డి పేరు ఖరారయినట్లు సమాచారం. పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు పగ్గాలు చేపట్టి విజయం దిశగా తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి పాత్రను హైకమాండ్ కూడా తక్కువగా అంచనా వేయడం లేదు.
రేవంత్ కే ముఖ్యమంత్రి...
అందుకే ఆయనకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే నేడు ఉదయం 9.30 గంటలకు శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నేతను లాంఛనంగా ఎన్నుకుంటారు. తర్వాత కొద్దిమందితో కలసి ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా డిసెంబరు 9వ తేదీన ఎల్.బి. స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రమాణ స్వీకారం చేస్తారా? అన్నది తెలియాల్సి ఉన్నప్పటికీ ఈరోజే ఆయన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించిన తర్వాత డిసెంబరు 9న మాత్రం పెద్దయెత్తున బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story