Sun Dec 29 2024 01:53:01 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడు పై కాంగ్రెస్ నేడు వ్యూహరచన
మునుగోడు ఉప ఎన్నికపై నేడు గాంధీ భవన్ లో కాంగ్రెస్ సమీక్ష నిర్వహించనుంది
మునుగోడు ఉప ఎన్నికపై నేడు గాంధీ భవన్ లో కాంగ్రెస్ సమీక్ష నిర్వహించనుంది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ ఈ సమీక్ష నిర్వహించనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యనేతలందరూ ఈ సమీక్షకు హాజరుకానున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో నేతలతో మాణికం ఠాగూర్ చర్చించనున్నారు.
రాహుల్ యాత్రలో...
మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ నెల 7వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే పాల్వాయి స్రవంతిని మునుగోడు అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. నామినేషన్ ఎప్పుడు వేయాలి? ప్రచార వ్యూహంతో పాటు రాహుల్ గాంధీ జోడోయాత్ర సమయంలో నేతలు ఎవరెవరు పాల్గొనాలి అన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Next Story