Sat Jan 11 2025 15:08:46 GMT+0000 (Coordinated Universal Time)
Nalgonda : నల్లగొండ మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇక కాంగ్రెస్ కే
నల్లగొండ మున్సిపల్ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకోనుంది. అవిశ్వాస తీర్మానాన్ని మెజారిటీ సభ్యులు ఆమోదించారు
నల్లగొండ మున్సిపల్ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకోనుంది. మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి మున్సిపల్ ఛైర్మన్ ను దించారు. త్వరలో ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు. నల్లగొండ మున్సిపల్ ఛైర్మన్ పదవి అవిశ్వాస తీర్మానం కోసం 48 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరు అయ్యారు.
మద్దతుగా...
వీరిలో అవిశ్వాసానికి 41 మంది అనుకూలంగా ఓటు వేశారు. అవిశ్వాసం తీర్మానికి మద్దతుగా పదిహేను మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు గా మద్దతు ఇచ్చారు. త్వరలోనే కలెక్టర్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఎప్పుడు ఎన్నిక జరిగినా ఇక కాంగ్రెస్ మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
Next Story