Thu Dec 19 2024 19:11:19 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Congress : నేడు కాంగ్రెస్ జనజాతర
కాంగ్రెస్ నేడు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. తుక్కుగూడలో జరగనున్న ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు
తెలంగాణ కాంగ్రెస్ నేడు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. తుక్కుగూడలో జరగనున్న ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా తుక్కుగూడలో జాతీయ మ్యానిఫేస్టోను రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు.
పది లక్షల మంది...
పెద్దయెత్తున జనసమీకరణకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీనికి జనజాతరగా ఇప్పటికే నామకరణం చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పది లక్షల మంది ప్రజలను ఈ జనజాతరకు తరలించాలన్న ఆదేశాలు పార్టీ నుంచి అందడంతో నేతలు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ ప్రచారాన్ని ఇక్కడి నుంచే కాంగ్రెస్ ప్రారంభించనుంది.
Next Story