Sun Dec 14 2025 18:21:06 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో నేడు కాంగ్రెస్ నిరసనలు
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించనందుకు నిరసనగా నేడు కాంగ్రెస్ ఆందోళన చేయనుంది

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించనందుకు నిరసనగా నేడు కాంగ్రెస్ ఆందోళన చేయనుంది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష కు నిరసనగా నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం చేపట్టనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ట్యాంకుబండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా టిపిసిసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
దిష్టిబొమ్మల దహనం...
నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 3 వ తేదీన స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు , డిసిసిలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, మహిళ కాంగ్రెస్ విభాగం తో పాటు పార్టీ అనుబంధ సంఘాలు పాల్గొనాలని మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి తెలంగాణ కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దగ్దం చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది.
Next Story

