Mon Dec 23 2024 06:13:46 GMT+0000 (Coordinated Universal Time)
పాఠశాలలో 42 మంది విద్యార్థులకు కరోనా
సంగారెడ్డి జిల్లాలో ఒక పాఠశాలలోకరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు గుర్తించారు
సంగారెడ్డి జిల్లాలో ఒక పాఠశాలలోకరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు గుర్తించారు. వీరితో పాటు ఒక ఉపాధ్యాయురాలికి కూడా కరోనా సోకింది. సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులను అక్కడి వసతి గృహంలోనే క్వారంటైన్ లో ఉంచారు. వారి రక్త నమూనాలను జినోమ్ స్వీక్వెన్సింగ్ కు పంపారు.
రక్త నమూనాలను...
దీంతో ఆ పాఠశాలలో ఉన్న మిగిలిన విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా పరీక్షలు చేయించుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కానీ ఎలా వచ్చిందో తెలియడం లేదని అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు.
Next Story