Fri Nov 22 2024 20:45:14 GMT+0000 (Coordinated Universal Time)
టీఎస్ పోలీస్ శాఖపై కరోనా పంజా.. 500 మందికి పాజిటివ్ ?
రాష్ట్ర పోలీస్ శాఖను మాయదారి వైరస్ కలవరపెడుతోంది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలు అందించిన పోలీసులు కరోనా బారిన
టీఎస్ పోలీస్ శాఖపై కరోనా పంజా విసిరిందా ? పోలీస్ డిపార్ట్ మెంట్లో 500 మందికి పాజిటివ్ గా తేలిందా ? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ పోలీసులు. రాష్ట్ర పోలీస్ శాఖను మాయదారి వైరస్ కలవరపెడుతోంది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలు అందించిన పోలీసులు కరోనా బారిన పడుతుండటం బాధాకరం. థర్డ్ వేవ్ మొదలు.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 500 మంది పోలీసులు కరోనా బారిన పడినట్లు అధికారులు చెప్తున్నారు. భాగ్యనగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో విధులు నిర్వర్తించే పలువురు పోలీసులు వరుసగా వైరస్ బారినపడుతుండటం అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
పోలీసులకు సైతం కరోనా సోకుతుండటంతో.. పలు స్టేషన్లు ఆంక్షలు విధించాయి. ఫిర్యాదు చేయాలంటే ఒక్కఫిర్యాదు దారుడు మాత్రమే స్టేషన్ కు రావాలని ఆంక్షలు పెట్టారు. మరోవైపు.. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న పోలీసులకు బూస్టర్ డోస్ వేగంగా అందించాలని అధికారులకు ఆదేశాలొచ్చాయి. హోమ్ గార్డ్ నుంచి ఐపీఎస్ వరకు అందరూ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Next Story