Mon Dec 23 2024 03:43:29 GMT+0000 (Coordinated Universal Time)
ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం.. 119 మందికి పాజిటివ్
సంగారెడ్డి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం రేగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా బారిన పడ్డారు
సంగారెడ్డి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం రేగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విద్యార్థులతో పాటు సిబ్బందికి కూడా కరోనా సోకింది. దాదాపు 119 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. అయితే వీరిందరికి స్వల్ప లక్షణాలు ఉండటంతో హోం ఐసొలేషన్ లోనే ఉంచి చికిత్స అందించాలని నిర్ణయించారు.
ఈసారి వేగంగా....
కరోనా ఈసారి వ్యాప్తి వేగంగా ఉంది. అందుకే ఎక్కువగా పాఠశాలలు, కళాశాలల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. యూనివర్సిటీల నుంచి పాఠశాలల వరకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని కళాశాలలకు సంక్రాంతి సెలవులు ముందుగానే ఇచ్చారు. అయినా కరోనా మాత్రం విద్యాసంస్థలను వీడటం లేదు.
- Tags
- corona
- iit campus
Next Story