Mon Dec 23 2024 05:17:06 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడులో కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతు
మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ దాదాపుగా ముగిసింది. 13వ రౌండ్లు పూర్తయ్యాయి. ఇక కొద్దో గొప్పో ఓట్లు లెక్కించేవి ఉంటాయి.
మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ దాదాపుగా ముగిసింది. 13వ రౌండ్లు పూర్తయ్యాయి. ఇక కొద్దో గొప్పో ఓట్లు లెక్కించేవి ఉంటాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం దాదాపుగా ఖరారయింది. అయితే ఈ ఉప ఎన్నికలో విచారం ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్లు కోల్పోయినట్లయింది. ఇప్పటి వరకూ ఆమెకు 17,627 ఓట్లు మాత్రమే వచ్చాయి.
మహిళ ఓటర్లపై...
ఇక మరో రెండు మిగిలి ఉంది. ఇందులోనూ ఆమెకు పెద్దగా వచ్చే అవకాశాలు లేవు. మహిళ ఓటర్లపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. మహిళలు ఎవరూ హస్తం పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నది ఫలితాలను బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలోనూ ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఓటు బ్యాంకు టర్న్ అయిందనే అనుకోవాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ సాధారణ ఎన్నికల నాటికి పుంజకునేందుకు కొంత కృషఇ చేయా్లసి ఉంటుంది.
Next Story