Mon Dec 23 2024 07:26:55 GMT+0000 (Coordinated Universal Time)
తొలుత పోస్టల్ బ్యాలెట్లతో.. మరికాసేపట్లోనే?
మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలట్ ను లెక్కించనున్నారు
మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలట్ ను లెక్కించనున్నారు. పోలైన 686 పోస్టల్ బ్యాలట్లను తొలుత లెక్కిస్తారు. అనంతరం పదిహేను రౌండ్లలో మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మునుగోడులో మొత్తం 93.13 శాతం ఓట్లు నమోదయిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలున్నాయి.
మధ్యాహ్నం ఒంటి గంటకు...
నల్లగొండ అర్జాల బావి వేర్హౌస్ కార్పొరేషన్ గోదాములో ఈ కౌంటింగ్ జరగనుంది. మొత్తం పది హేను రౌండ్లలో ఒక్కో రౌండ్లో 21 కేంద్రాల ఓట్లను లెక్కించనున్నారు. తొలుత చౌటుప్పల్, నారాయణపూరం, మునుగోడు, చుండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్ మండాలలను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్ ఉంటారు. దీంతో ఎవరిది గెలుపు అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Next Story