Sun Dec 22 2024 13:30:35 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో ఓట్ల లెక్కింపు మాత్రం.. సాయంత్రానికి తేలే అవకాశం
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం పదిహేడు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్నికల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఇందుకోసం 34 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలట్ లు లెక్కించిన తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది.
కంటోన్మెంట్ ఉప ఎన్నికకూడా...
దీంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం కానుంంది. మొత్తం 34 ప్రాంతాల్లో కౌంటింగ్ ను నిర్వహిస్తున్నారు. మొత్తం 2.18 లక్షల పోస్టల్ బ్యాలట్ లను తొలుత లెక్కించనున్నారు. ఇందుకోసం 275 టేబుళ్లను ఏర్పాటు చేశారు. దాదాపు గా అన్ని నియోజవర్గాల్లో పద్దెనిమిది నుంచి 21 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఎవరికి మెజారిటీ స్థానాలు వస్తాయన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.
Next Story