Mon Dec 23 2024 00:29:46 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను న్యాయస్థానం పొడిగించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను న్యాయస్థానం పొడిగించింది. జూన్ 3వ తేదీ వరకూ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈరోజుతో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో వర్చువల్ గా కవితను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.
మార్చి 15న అరెస్ట్ చేసి....
అయితే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మాత్రం కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించింది. తిరిగి జూన్ 3వ తేదీన న్యాయస్థానం ఎదుట హాజరుపర్చాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. మార్చి 15వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన కవిత గత రెండు నెలలకు పైగానే తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
Next Story