Mon Dec 23 2024 10:09:48 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కవితకు మళ్లీ రిమాండ్ పొడిగింపు.. ఎప్పటి వరకూ అంటే?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను న్యాయస్థానం పొడిగించింది
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 13వ తేదీ వరకూ కవిత రిమాండ్ ను పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో ఆగస్టు 13వ తేదీ వరకూ కల్వకుంట్ల కవిత తీహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను ఈ ఏడాది మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని, సౌత్ లాబీయింగ్ చేసి వందల కోట్ల రూపాయలు ఆప్ ప్రభుత్వానికి అప్పచెప్పిందని ఈడీ ఆరోపించింది. ఈడీ, సీబీఐలు కేసులు నమోదు చేయడంతో ఆమె తీహార్ జైలులో నిందితురాలిగా ఉన్నారు.
Next Story