Sun Dec 22 2024 19:18:18 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి న్యాయస్థానం పొడిగించింది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి న్యాయస్థానం పొడిగించింది. ఈరోజు కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపర్చారు. జైలు నుంచే కవితను న్యాయస్థానం ఎదుట హాజరుపర్చడంతో న్యాయమూర్తి జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జులై 25వ తేదీ వరకూ కవితకస్టడీని పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ఆదేశించారు.
జులై 25వ తేదీ వరకూ...
తదుపరివిచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. కవితను ఆరోజు మళ్లీ కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. ఢిల్లీ మద్యం కుంభ కోణం కేసులో కవితను ఎన్ఫోర్స్్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. కవిత బెయిల్ పిటీషన్లను కూడా న్యాయస్థానాలు తిరస్కరించాయి.
Next Story