Mon Dec 23 2024 07:58:57 GMT+0000 (Coordinated Universal Time)
గాంధీలో భారీగా కరోనా కేసులు నమోదు.. ఆందోళనలో వైద్యులు !
గాంధీ ఆస్పత్రి అనుబంధ సంస్థ మెడికల్ కాలేజీలో 20 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు, 10 మంది హౌస్ సర్జన్లకు, 10 మంది
దేశంలో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న వేళ.. భారీ సంఖ్యలో వైద్యులు సైతం కరోనా బారిన పడుతుంటడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులలో భారీ మొత్తంలో కరోనా కేసులు నమోదయ్యాయి. రెండు ఆస్పత్రుల్లోని సిబ్బందికి, గాంధీ అనుబంధ సంస్థ మెడికల్ కాలేజీలో పెద్దఎత్తున కోవిడ్ కేసులు నమోదవ్వడం.. అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకూ కోవిడ్ నిర్థారణ అయినవారందరినీ క్వారంటైన్ కు తరలించి, చికిత్స చేస్తున్నారు.
Also Read : "మహానటి" కి కరోనా పాజిటివ్
గాంధీ ఆస్పత్రి అనుబంధ సంస్థ మెడికల్ కాలేజీలో 20 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు, 10 మంది హౌస్ సర్జన్లకు, 10 మంది పీజీ విద్యార్థులకు, నలుగురు ఫ్యాకల్టీకి కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. అలాగే గాంధీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, ప్రాక్టీస్ విద్యార్థులు కలిపి 44 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అటు ఉస్మానియాలోనూ కరోనా కల్లోలం రేగింది. ఉస్మానియాలో 19 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్, 35 మంది హౌస్ సర్జన్లు, 23 మంది జూనియర్ డాక్టర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కరోనా సోకింది. మొత్తం ఉస్మానియాలో 79 మంది సిబ్బందికి కోవిడ్ గా నిర్థారణ అవ్వడంతో అధికారులు, వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారందరినీ క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు.
Next Story