Sun Dec 22 2024 17:31:03 GMT+0000 (Coordinated Universal Time)
Singareni : సింగరేణి ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్.. సీపీఐ అనుబంధ సంస్థదే విజయం
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ విజయం సాధించింది.
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ విజయం సాధించింది. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ పోరాడినా చివరకు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మొన్నటి వరకూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అనుబంధ కార్మికసంఘం టీజబీకేఎస్ అసలు ఖాతా కూడా తెరవక పోవడం విశేషం. మొత్తం మీద సీపీఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీకే బొగ్గు గని కార్మికులు జై కొట్టారు.
అన్ని ప్రాంతాల్లో....
నిన్న పదకొండు ఏరియాల్లో జరిగిన ఈ గుర్తింపు ఎన్నికల్లో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నక్షత్రం గుర్తున్న ఏఐటీయూసీ వైపు కార్మికులు నిలిచారు. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం -1, రామగుండం -2, రామగుండం -3 ప్రాంతాల్లో ఏఐటీయూసీకే ఆధిక్యత లభించింది. గత రెండు దఫాలుగా అంటే 2012, 2017లో జరిగిన ఎననికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీజీబీకేఎస్ గెలిచింది. ఈసారి ఎక్కడా కూడా దాని ఊసే లేదు. కార్మికులు ఆ సంఘాన్ని పట్టించుకోలేదు. ఈ సంఘానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
Next Story